డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 ఫైనల్లో భాగంగా ఇక్కడ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 24 బంతుల్లో ఐదు ఫోర్లు, 3 సిక్సర్లు సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేసిన వార్నర్.. ఒక ఐపీఎల్లో ఫైనల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 2010లో ఐపీఎల్లో ఫైనల్లో సురేష్ రైనా 24 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో అతనితో కలిసి సంయుక్తంగా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును పంచుకున్నాడు.
ఇదిలా ఉండగా, చివరి మూడు ఓవర్లలో సన్ రైజర్స్ 52 పరుగులను సాధించడం మ్యాచ్ కే హైలెట్. అంతకుముందు ఐదు ఓవర్లలో కలిపి 40 పరుగులు మాత్రమే వస్తే, చివరి మూడు ఓవర్లలో 17.0 పరుగుల పైగా సగటుతో 52 పరుగులు రావడం విశేషం. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే.