
తైపీ సిటీ: చైనీస్ తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ తరఫున అజయ్ జయరామ్ ఒక్కడే నిలిచాడు. పురుషుల సింగిల్స్‌లో అతను క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, మాజీ జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ ఆట ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. భారత స్టార్లు దూరంగా ఉన్న ఈ టోర్నీలో మిగతా యువ షట్లర్లంతా తొలిరౌండ్లోనే కంగుతిన్నారు.
గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అజయ్ 21–10, 22–20తో డెన్మార్క్‌కు చెందిన కిమ్ బ్రూన్‌ను వరుస గేముల్లో ఓడించాడు. 30 ఏళ్ల భారత ఆటగాడు... క్వార్టర్స్‌లో లీ జి జియా (మలేసియా)తో తలపడతాడు. సౌరభ్ వర్మ 21–19, 21–23, 16–21తో జపాన్‌కు చెందిన రిచి తకషిత చేతిలో పరాజయం చవిచూశాడు.
Comments
Please login to add a commentAdd a comment