ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించాలంటూ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో సలహాదారు అమిస్ క్యూరీ పేర్కొంది. బీసీసీఐ అధ్యక్షుడిగా చేసిన ప్రమాణాన్ని అనురాగ్ ఠాకూర్ ఉల్లంఘించారని కోర్టుకు బీసీసీఐకి మధ్యవర్తిత్వం వహించిన అమికస్ క్యూరీ స్పష్టం చేసింది. ఈ మేరకు గోపాల్ సుబ్రహమణ్యం నేతృత్వంలోని అమికస్ క్యూరీ గురువారం కోర్టుకు నివేదిక సమర్పించారు. బోర్డు అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని కోర్టుకు తెలిపారు.