Amicus curiae
-
ఈడీ కేసు నమోదు చేయొచ్చా?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఫారెన్ ఎక్స్చేంజ్ లో అవకతవకలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేయవచ్చో, లేదో తెలియజేయాలని కోరుతూ ఎంబీఎస్ కేసులో హైకోర్టు అమికస్ క్యూరీని నియమించింది. చట్టవిరుద్ధంగా బంగారం, వజ్రాల కొనుగోళ్లకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రముఖ నగల వ్యాపార సంస్థ ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్‌పై అక్టోబర్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంస్థ కార్యాలయాలు, దుకాణాలు, యజమానుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపి రూ.100 కోట్ల విలువైన బంగారు, వజ్రాల నగలను, మరో రూ.50 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వజ్రాల కొనుగోళ్లకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈడీ కేసును సవాల్ చేస్తూ యజమాని సుఖేశ్‌గుప్తా హైకోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి జస్టిస్ కె.సురేందర్ శుక్రవారం విచారణ చేపట్టారు. అసలు ఫారెన్ ఎక్స్చేంజ్ లో తేడాలకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేయవచ్చా?.. ప్రొసీడింగ్స్ ఆఫ్ క్రైమ్‌గా పరిగణించవచ్చా? అనేది చెప్పాలని అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డిని న్యాయమూర్తి నియమించారు. కేసు మెటీరియల్ అంతా ఆయనకు అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. -
గంగూలీ, జై షా పదవుల వ్యవహారం.. అమికస్ క్యూరీగా మణిందర్ సింగ్
బీసీసీఐకి సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు గురువారం సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్‌ను అమికస్ క్యూరీగా నియమించింది. గంగూలీ, జై షా సహా ఇతర ఆఫీస్ బేరర్లు పదవుల్లో కొనసాగడంపై రాజ్యాంగ సవరణకు సంబంధించిన పిటిషన్‌ను బీసీసీఐ గతంలోనే సుప్రీంకోర్టులో వేసింది. తాజాగా ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధార్మసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే అమికస్ క్యూరీగా మణిందర్ సింగ్ నియమిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌కు సంబంధించిన విచారణను తిరిగి జూలై 28న చేపడతామని తెలిపింది. కాగా ఇంతకముందు అమికస్ క్యూరీగా ఉన్న పీఎస్ నరసింహ న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో ఆయన స్థానంలో మణిందర్ సింగ్ నియమించారు. జస్టిస్ ఆర్ఎం లోథా కమిటీ సిఫార్సుల మేరకు బీసీసీఐ లేదా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లో గరిష్టంగా ఆరేళ్లకు మించి పనిచేయకూడదు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే మధ్యలో మూడేళ్ల విరామం తప్పనిసరి అనే నిబంధన ఉంది. గంగూలీ, జై షాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లో సుధీర్ఘ కాలం పనిచేశారు. గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసిచేషన్.. జై షా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌లో విధులు నిర్వర్తించారు. నిబంధనల ప్రకారం చూస్తే గంగూలీ, జై షాలు ఎప్పుడో ఆ పదవి నుంచి దిగిపోవాలి. అయితూ డిసెంబర్ 2019లో జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో మూడేళ్ల విరామం నిబంధనను తొలగిస్తూ ప్రతిపాదనను తీసుకొచ్చింది. చదవండి: బీసీసీఐ పిటిషన్‌పై విచారణ వాయిదా గంగూలీ, జై షా పదవుల్లో కొనసాగుతారా? వారంలో వీడనున్న ఉత్కంఠ -
బీసీసీఐకి గట్టి దెబ్బ!
న్యూఢిల్లీ: క్రికెట్ బోర్డుకు ఇది గట్టి ఎదురుదెబ్బే! భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఏమాత్రం మింగుడుపడని విధంగా కోర్టు సహాయకుడు (అమికస్ క్యూరీ) వ్యవహరించారు. బోర్డు ప్రక్షాళన, పారదర్శకత కోసం జస్టిస్ ఆర్.ఎమ్.లోధా కమిటీ చేసిన ప్రధాన సిఫార్సుల్ని అమలు చేయాల్సిందేనని అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియమ్ సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించారు. ఒక్కటి మినహా మిగతా సిఫార్సుల్ని బీసీసీఐ నియమావళిలో చేర్చాల్సిందేనన్నారు. ఆ ఒక్కటి ఏంటంటే సెలక్షన్ కమిటీ నియామక ప్రక్రియ. ఐదుగురు సభ్యుల ప్యానెల్‌ను ముగ్గురితో కుదించకుండా కొనసాగవచ్చని, కేవలం టెస్టులాడిన వారినే సెలక్టర్లు చేయాల్సిన పనిలేకుండా 20 ‘ఫస్ట్‌క్లాస్’ మ్యాచ్‌లాడినా ఫర్వాలేదన్నారు. మిగతా ఐదు ప్రధాన సిఫార్సులైన... ఒక రాష్ట్రం–ఒక ఓటు, గరిష్టంగా పదవుల్లో కొనసాగే కాలం 18 ఏళ్లు (9+9), పదవుల మధ్య మూడేళ్ల విరామం, 70 ఏళ్ల గరిష్ట వయో పరిమితి, ఎన్నికైన సభ్యులు (ఆఫీస్ బేరర్లు), సీఈఓ (ప్రొఫెషనల్స్)ల మధ్య అధికార పంపకాలులాంటివి అమలు చేయాలని సుబ్రమణియమ్ నివేదిక సమర్పించారు. దీనిపై సుప్రీం కోర్టు జూలై 4న జరిగే విచారణలో తీర్పు ఇచ్చే అవకాశముంది. -
గాంధీజీ హత్య కేసు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
గాంధీజీ హత్య కేసు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ హత్య కేసుకు సంబంధించి ఎటువంటి పునర్విచారణ చేపట్టాల్సిన అవసరంగానీ, తీర్పును పునఃసమీక్షించాల్సిన ఆవశ్యకతగానీ లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ముంబైకి చెందిన పంకజ్ ఫడ్నిస్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు బుధవారం ధర్మాసనం స్పష్టం చేసింది. ‘జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రజల్లో కొత్త అనుమానాలు రేకెత్తించేందుకు మీరు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి దోషులను గుర్తించి, ఉరిశిక్ష కూడా విధించారు. ఇక ఈ కేసు గురించి మళ్లీ ఎటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. తీర్పును సరిదిద్దాల్సిన అవసరమూ లేదు’ అని పిటిషనర్‌ను ఉద్దేశించి జస్టిస్ ఎస్ఏ బొబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి అంశాల్లో సెంటిమెంట్లు, భావోద్వేగాలు పనికిరావని, చట్టపరంగానే వ్యవహరించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ముంబైకి చెందిన అభినవ్ భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ ఫడ్నిస్.. గాంధీజీ హత్య కేసులో విదేశీ కుట్ర ఉందని, నాలుగో బుల్లెట్ గురించిన నిజాలు తెలియాలంటే పునర్విచారణ జరిపించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ‘కపూర్ కమిషన్-1969 నివేదిక ప్రకారం వినాయక దామోదర్ సావర్కర్‌పై పలువురు అసంబద్ధ, అసత్య వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా మరాఠా సమాజమంతా నిందించబడింది. కాబట్టి ఇటువంటి నిందలను తొలగించుకోవాలంటే ఈ కేసు పునర్విచారణ చేపట్టాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. గాంధీజీ హత్యకేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది అమరేంద్ర శరన్.. ఈ కేసుకు సంబంధించి అన్ని అంశాలపై లోతుగా విచారించి, నిందితులకు శిక్ష విధించారని జనవరిలో సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
నాలుగో బుల్లెట్.. అంతా ఉత్తదే...
సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ హత్య కేసు పునర్విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడు)గా సీనియర్ అడ్వొకేట్ అమరేందర్ శరణ్ నియమించిన విషయం తెలిసిందే. ఈ అంశంలో సుదీర్ఘ పరిశీలన చేపట్టిన ఆయన సోమవారం తన నివేదికను సుప్రీం కోర్టుకు అందజేశారు. మహాత్మాగాంధీని గాడ్సేనే హతమార్చాడని.. ఇందులో విదేశీ నిఘా సంస్థల వ్యక్తుల ప్రమేయం లేదని అమికస్ క్యూరీ స్పష్టం చేశారు. కేసును పునర్విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ అర్కైవ్స్ నుంచి అవసరమైన పత్రాలు, నివేదిక క్షణ్ణంగా పరిశీలించాకే ఈ నివేదికను రూపొందించినట్లు అమరేందర్ వెల్లడించారు. నాలుగో బుల్లెట్ గాంధీ ప్రాణం తీసిందన్న అంశం ఉత్తదేనని ఆయన తేల్చేశారు. కాగా, గాంధీ హత్య కేసులో పలు అనుమానాలు ఉన్నాయని.. దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని కోరుతూ ముంబైకి చెందిన పరిశోధకుడు, అభినవ్ భారత్ సంస్థ ట్రస్టీ పంకజ్ ఫడ్నవీస్ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే ఈ వాదనను గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ ఖండించారు. ఈ కేసులో జోక్యం చేసుకొనే హక్కు పంకజ్‌కు లేదంటూ తుషార్ తరఫు న్యాయవాది కోర్టులో విన్నవించారు. మరి ఆ హక్కు తుషార్‌కు ఉందా? అని ప్రశ్నించిన బెంచ్.. ఈ కేసులో తమకూ చాలా అనుమానాలున్నాయని, శరణ్ నివేదిక అందేవరకూ తుది నిర్ణయం తీసుకోలేమని వ్యాఖ్యానించింది కూడా. -
'బీసీసీఐ బాస్‌గా పిళ్లైని నియమించాలి'
ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించాలంటూ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో సలహాదారు అమిస్ క్యూరీ పేర్కొంది. బీసీసీఐ అధ్యక్షుడిగా చేసిన ప్రమాణాన్ని అనురాగ్ ఠాకూర్ ఉల్లంఘించారని కోర్టుకు బీసీసీఐకి మధ్యవర్తిత్వం వహించిన అమికస్ క్యూరీ స్పష్టం చేసింది. ఈ మేరకు గోపాల్ సుబ్రహమణ్యం నేతృత్వంలోని అమికస్ క్యూరీ గురువారం కోర్టుకు నివేదిక సమర్పించారు. బోర్డు అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని కోర్టుకు తెలిపారు. -
నిర్భయ కేసులో అమికస్ క్యూరీలపై స్పష్టత
న్యూఢిల్లీ: ‘నిర్భయ’ అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు అమికస్ క్యూరీల నియామకంపై సుప్రీం కోర్టు స్పష్టతనిచ్చింది. వీరి నియామకం దోషుల తరఫు లాయర్ల హోదా, సామర్థ్యాన్ని కించపరచదని తెలిపింది. అమికస్ క్యూరీల నియామకంతో లాయర్ల సామర్థ్యంపై ప్రజల్లో కొన్ని తప్పుడు అభిప్రాయాలు నెలకొని ఉన్నాయని దోషుల తరఫు న్యాయవాది ఒకరు చెప్పాక జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ పై విధంగా స్పందించింది. కేసులో రెండు వర్గాలు తమ న్యాయవాదులను నియమించుకున్నా కోర్టులు అమికస్ క్యూరీలను నియమిస్తాయి. దీనర్థం న్యాయవాదులు అసమర్థులని కాదు. అమికస్ క్యూరీల అభిప్రాయంతో కేసు గురించి మరింత తెలసుకుంటాం ’ అని పేర్కొంది. -
ఆ ఎన్‌కౌంటర్‌పై అమికస్ క్యూరీ: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాలో 2008లో ఇద్దరు యువతులపై యాసిడ్ దాడికి పాల్పడిన యువకులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన కేసులో కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా ఓ న్యాయవాదిని నియమించాలని హైకోర్టు సోమవారం నిర్ణయించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2008, డిసెంబర్ 13న వరంగల్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంటికి వెళుతున్న ఇద్దరు యువతులపై యాసిడ్ దాడి చేశారంటూ ఎస్.శ్రీనివాసరావు, మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పౌర హక్కుల నేత చైతన్య 2008లో హైకోర్టును ఆశ్రయించారు. -
సమన్యాయసాధనలో ‘సమవర్తి’
నివాళి: న్యాయవాద వృత్తిలో విలువలు, నీతి నిజాయితీల కోసం పాటుపడిన అరుదైన న్యాయవాది పద్మనాభరెడ్డి. న్యాయవాదులు వృత్తి విలువల కోసం నిలబడితే ప్రజల హక్కులు కాపాడవచ్చునని నిరూపించారు. కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, అవసరమైతే ఉచితంగానే వాదించడం, వామపక్ష ఉద్యమాల వైపు మొగ్గు చూపడం, అండదండలు ఇవ్వడం, ప్రభావాలకు లొంగకపోవడం ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి. హైకోర్టు సీనియర్ న్యాయ వాది సి.పద్మనాభరెడ్డి మృతితో ప్రజా ఉద్యమాలకు అండదం డలందించే గొప్ప మానవతావా దిని సమాజం కోల్పోయింది. 1931, మార్చి 18న అనంతపురంజిల్లా యాడికి గ్రామంలో మధ్యతరగతి కుటుం బంలో పద్మనాభరెడ్డి జన్మించారు. తండ్రి ఓబుల్‌రెడ్డి, తల్లి సోమక్క. 5వ తరగతి వరకు యాడికి వీధి బడిలో చదివారు. 6 నుంచి 8 తరగతుల వరకు మున్సిపల్ హైస్కూ లు, తాడిపత్రిలో చదివారు. 9, ఎస్ఎస్ఎల్సీ లండన్ మిషన్ హైస్కూల్, గుత్తిలో చదివారు. గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్, అనంతపురం గవర్నమెంట్ కాలేజీలో బీఎస్సీ, మద్రాస్ యూనివర్సిటీలో ‘లా’ చదివారు. 1953 లో లాయర్‌గా మద్రాస్ హైకోర్టులో నమోదు చేసుకు న్నారు. అక్కడ కొంతకాలం ప్రాక్టీస్ చేసి 1954లో గుం టూరు (ఆంధ్ర హైకోర్టు)లో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 1956లో వచ్చారు. ‘‘నన్ను గుంటూరు కాలేజీలో చేర్పించిందీ, మద్రాసు లోని లా కాలేజీలో చేర్చించిందీ చిన్నపరెడ్డే. వారి ఇంట్లోనే నేను పెరిగాను. నా హైస్కూలు రోజుల నుంచి ఆయన నా గురువూ, మార్గదర్శకుడూనూ. ఇప్పుడు నేను ఏమైనా సాధించానంటే అదంతా ఆయన చలవే. జస్టిస్ చిన్నపరెడ్డి మమ్ములను ఎంత ప్రేమగా, అభిమానంగా చూశారో, దానంతటినీ నేను, నా కుటుంబ సభ్యులందరం ఎన్నటికీ మరిచిపోలేం. వాస్తవానికి నేను ఆయన లా ఛాంబర్లో 14 ఏళ్ల పాటు పనిచేశాను’’ అని జస్టిస్ చిన్నపరెడ్డిని గురించి చివరివరకు ఎంతో వినమ్రంగా చెప్పుకున్నారు పద్మనాభరెడ్డి. పద్మనాభరెడ్డి 60 ఏళ్ల సుదీర్ఘ కాలం క్రిమినల్ లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. హైకోర్టులో అరవై వేలకు పైగా కేసులు వాదించారు. సాధారణ ప్రజలు, పేదలు హైకోర్టులో సీనియర్ లాయర్లను నియమించుకోలేరు. వాళ్ల ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. ఫీజులు ఇవ్వలేని కేసులలో కూడా పద్మనాభరెడ్డి వాదించి గెలిపించారు. జైలులోని ముద్దాయిలు కార్డుముక్క రాసినా ఆయన స్పందించేవారు. కేసులో ముద్దాయి ధనికుడా, పేదవాడా అనే తేడా లేకుండా వాదించారు. ఆయన గురించి చెప్పడ మంటే ముద్దాయిలు, ఖైదీలు, కార్మికులు, పేదలు, న్యాయాన్యాయాల గురించి చెప్పడమే! ప్రతి క్రిమినల్ అప్పీలు కేసులో సుమారు 100 పేజీల నుంచి వెయ్యి పేజీలకుపైగా రికార్డు ఉంటుంది. తనకున్న అపరిమిత పరిజ్ఞానంతో అన్ని పేజీలను స్కాన్ చేసి అందులో మూడో, నాలుగో అంశాల మీద కేసును తీసుకొచ్చి కేసులో వైరుధ్యాలను, చట్టవ్యతిరేక అంశాలు, నిపుణుల అభిప్రాయాలు, సాక్ష్యుల సాక్ష్యాలను, సహజ న్యాయశాస్త్ర ఉల్లంఘనలను ఎత్తి చూపేవారు. వీటితో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను జోడించేవారు. ఇంత పరిజ్ఞానం ఉన్నా ఆయన అతి సాధారణ వ్యక్తిగా మన కళ్లముందు, మనతో కలిసి ఉండటం ఆయనకే చెల్లింది. ఆయన నిగర్వి, గర్వపడేవాళ్లను అసహ్యించుకునేవారు. ఏనాడు ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించి ఎరుగరు. ఎవరు ఏ సలహా అడి గినా ఓపిగ్గా, వివరంగా తెలియజేసేవారు. ఎంత తీరికలేని పనిలో ఉన్నా అడిగినవారికి నవ్వుతూనే సమాధానం చెప్పేవారు. ఏ గ్రామంలోనైనా, జైలులోనైనా క్రిమినల్ కేసుల మీద చర్చ జరిగిందంటే పద్మనాభరెడ్డి పేరు చర్చకు వచ్చేది. అధికారంలో ఉన్న పార్టీ ప్రజలనే కాదు ప్రతిపక్షాల నాయకులను కూడా పి.డి. కుట్ర కేసులు పెట్టి, జైలులోకి నెట్టడం ఈ రోజుల్లో మాదిరే, ఆరోజుల్లోనూ సర్వసాధా రణంగా మారిపోయింది. ఏ రాజకీయ పార్టీతో సంబం ధంలేకుండా ఆయన కేసులు వాదించారు. ప్రభుత్వ సర్వీ సులలో ఉన్న ప్రముఖులు, ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఏదో ఒక కాలంలో కేసుల కోసమో, సలహాల కోసమో ఆయనను సంప్రదించిన వారే. ఎంతో ఓపికగా వాళ్లు చెప్పింది విని, రికార్డులు పరిశీలించి వాళ్లకు సలహాలిచ్చారు. ఆయన సలహా తిరు గులేనిది. దాన్ని వాళ్లు పాటించేవారు. ఒక్కోసారి కోర్టుకు అనుమానం వచ్చినా ఆయననే సంప్రదించేవారు. రాష్ట్రం లో వేలాది మంది న్యాయవాదులు, ప్రజలు, కొందరు న్యాయమూర్తులు ఆయనంటే అభిమానంతో ఉండేవారు. ఆయన మరణించిన తర్వాత వేలాది మంది ప్రముఖులు తరలివచ్చి నివాళులర్పించడమే ఇందుకు నిదర్శనం. ‘ఎదురుకాల్పులు’ జరిగినప్పుడు ఉద్యమకార్య కర్తలు, ప్రజలు చనిపోతుంటారు. ఎన్కౌంటర్లలో పోలీసు లకు కనీసం పెల్లెట్ల గాయాలైనా కావు. ‘ఎదురుకాల్పులు’ జరిగినప్పుడు పోలీసుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా? వద్దా? అనే ప్రశ్న హైకోర్టులో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకువచ్చింది. కోర్టు పద్మనాభరెడ్డిని ‘అమికస్ క్యూరీ’గా నియమించింది. ‘‘ఎన్కౌంటర్ జరిగినప్పుడు, పోలీసుల మీద కేసు నమోదుచేయాల్సిందే. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపా మని పోలీసులు కోర్టులో నిరూపించుకోవాలి. కేసు రిజి స్టర్ చేయకుండా పోలీసులే తీర్చునివ్వడం చట్టవ్యతిరేకం’’ అని ఆయన వాదించారు. ఆయన వాదనలను కోర్టు అంగీకరించింది. సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది. అత్యవసర పరిస్థితికి ముందు నుంచే అనధికారి కంగా ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో కొనసాగింది. పట్టుబడిన వారిని కాల్చిచంపడం, చిత్రహింసలకు గురిచేయడం, కేసులలో ఇరికించి జైళ్లలో నిర్బంధించడం పరిపాటైంది. మొదటిసారి రాష్ట్రంలో తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, మండ్ల సుబ్బారెడ్డి తదితరులపై హైదరాబాద్ కుట్రకేసును రాజ్యం బనాయించింది. ఆ తర్వాత కానూ సన్యాల్, నాగభూషణ్ పట్నాయక్, తేజేశ్వరరావు, సొరెన్‌బోస్ తదితరులపై పార్వతీపురం కుట్రకేసు పెట్టింది. రెండు కేసులలో ట్రయల్ కోర్టులు కొంత మందికి శిక్షలు విధించాయి. అప్పీళ్లు హైకోర్టుకు వచ్చాయి. హైకో ర్టులో పద్మనాభరెడ్డి వాదించారు. పార్వతీపురం కుట్ర కేసులో అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. హైదరా బాద్ కుట్ర కేసులో నెలరోజులు పద్మనాభరెడ్డి వాదిం చారు. హైకోర్టు శిక్షను ఖరారు చేసింది. కోర్టు నుంచి బయ టకు వచ్చీరాగానే హృదయం ద్రవించి ఆయన కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నాగిరెడ్డి అంటే తనకు ప్రత్యేక అభిమా నమని చెప్పు కునేవారు. విద్యార్థి దశ నుంచి ఏ ఉద్యమాలలో ఆయన పాల్గొన లేదు. అయితే వామపక్ష భావజాలమంటే మొగ్గు చూపే వాడినని ఆయనే చెప్పుకున్నారు. ఆ కారణంగానే ఆయన న్యాయవ్యవస్థకు, ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో తోడ్పాటునందించారు. మన రాష్ట్రంలో నక్సలైటు ఉద్య మం మొదలైనప్పుడు ప్రజల హక్కుల అణచివేత పెరి గింది. రాజకీయ ఖైదీల కోసం డిఫెన్స్ కమిటీ రావి సుబ్బా రావు ప్రేరణతో ఏర్పడింది. ఆయన నాయకత్వంలో పత్తిపాటి వెంకటేశ్వర్లు, బి.పి.జీవన్‌రెడ్డి, కన్నాభిరాన్, మనోహర్‌రాజ్ సక్సేనా, పద్మనాభరెడ్డి కమిటీ సభ్యులుగా ఉండేవారు. ఎమర్జెన్సీ కాలంలో రాజకీయ ఖైదీల విడుదల కోసం హైకోర్టులో పద్మనాభరెడ్డి వాదించారు. రావి సుబ్బారావు చనిపోయిన తర్వాత డెమోక్రటిక్ లాయర్స్ ఫోరంకు ఆయనే ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అదే సంఘం ఇండియన్ లాయర్స్ అసోసియేషన్‌గా మారింది. చివరివరకు ఆయనే ఆ సంఘానికి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండటం నేరం కాదని జస్టిస్ చిన్నపరెడ్డి ఎన్నో చరిత్రాత్మక తీర్పులు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇచ్చారు. రాజ్యం మాత్రం ఇప్పటికీ రాజ కీయ విశ్వాసాలను నేరంగానే పరిగణిస్తోంది. రాజకీయ విశ్వాసాలకు సంబంధించి వాదించిన కేసుల కారణంగా ఇంటెలిజెన్స్ నివేదిక ఆయనకు వ్యతిరేకంగా ఇవ్వడంతో పద్మనాభరెడ్డి హైకోర్టు జడ్జిగా నిమాయకం రద్దయింది. జస్టిస్ కృష్ణయ్యర్, చిన్నపరెడ్డి, భగవతి వంటి వారు లాయర్స్ యూనియన్‌లో నాయకులుగా ఉండి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులయ్యారు. ఈ వాస్తవాన్ని ఇం టెలిజెన్స్ నివేదిక తొక్కిపెట్టింది. పద్మనాభరెడ్డి జడ్జి అయి ఉంటే ప్రజలకు మరెంతో న్యాయం చేసి ఉండేవారు. క్లయింట్ ఏ రాజకీయ పార్టీకి చెందినవాడనే దాంతో లాయర్‌కు నిమిత్తం లేదు. నిషిద్ధ పార్టీకి చెందిన వాడైనా, రాజ్యాంగం మీద విశ్వాసం లేని వాడైనా కోర్టును ఆశ్ర యించవచ్చు. వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన పౌర హక్కు ను పొందవచ్చు. న్యాయం చేయమని కోరి వచ్చినప్పుడు తన విధి నిర్వహించడమే న్యాయవాది బాధ్యత. అదే సూత్రాన్ని ఆయన పాటిస్తూవచ్చారు. కేసు త్వరగా పరిష్కరించడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అది అమలుకు నోచుకోలేదు. టాలెంట్ ఉన్న సీనియర్ న్యాయవాదులను జడ్జీలుగా నియమించి మరికొన్ని కొత్త కోర్టులు ఏర్పాటు చేయటం వలన పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించవచ్చు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు మంచివే. రిటైర్డ్ జడ్జీలను ఈ కోర్టులలో నియ మిస్తే వారు అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. ట్రయల్ కోర్టులు త్వరగా తీర్పులిచ్చినా అప్పీలు కోర్టులలో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. అప్పీలులో కొన్ని కేసులు గెలుస్తున్నాయి. దీర్ఘకాలం కేసులు పెండింగ్‌లో ఉండటం, నిందితులు జైలులో ఉండటం వలన వాళ్ల భవిష్యత్తు, కుటుంబ పరిస్థితి, ఆర్థికస్థితి నాశనమయ్యే అవకాశం ఉందని ఆయన భావించేవారు. మీ అరవై సంవత్సరాల అనుభవాలను, సమాజానికి మీరిచ్చే సందేశాలను నమోదు చేస్తే బాగుంటుందని కోరినప్పుడు మే నెలలో పూర్తి చేస్తానన్నారు. న్యాయవాద వృత్తిలో విలువలు, నీతి, నిజాయితీల కోసం పాటుపడిన అరుదైన న్యాయవాది పద్మనాభరెడ్డి. న్యాయవాదులు వృత్తి విలువల కోసం నిలబడితే ప్రజల హక్కులు కాపా డవచ్చునని నిరూపించారు. కేసులను క్షుణ్ణంగా అధ్య యనం చేయడం, అవసరమైతే ఉచితంగానే వాదించడం, వామపక్ష ఉద్యమాల వైపు మొగ్గు చూపడం, అండదండ లివ్వడం, ప్రభావాలకు లొంగకపోవడం ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి. ఆయనో విజ్ఞానఖని. ఆయన మరణం ప్రజలకు ముఖ్యంగా పీడిత వర్గాలకు తీరని లోటు. పీడిత పక్షపాతి పద్మనాభరెడ్డికి జోహార్లు. - వి. నారాయణరెడ్డి న్యాయవాది