
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా కేరళ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ఏడు పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 49 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. బోడపాటి సుమంత్ (109 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలువగా... కెప్టెన్ హనుమ విహారి (27; 3 ఫోర్లు), డీబీ రవితేజ (44; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు.
191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ 49.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఆంధ్ర బౌలర్లలో కరణ్ శర్మ (3/37), బండారు అయ్యప్ప (2/28), రికీ భుయ్ (2/8) ఆకట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.