
'కోహ్లినా..నేనా అనేది ముఖ్యం కాదు'
ప్రతీ ఒక్క ఆటగాడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కొత్త క్రికెట్ కోచ్ అనిల్ కుంబ్లే ప్రణాళికలో భాగమని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ స్పష్టం చేశాడు.
బెంగళూరు:ప్రతీ ఒక్క ఆటగాడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కొత్త క్రికెట్ కోచ్ అనిల్ కుంబ్లే ప్రణాళికలో భాగమని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ స్పష్టం చేశాడు. అది టెస్టు కెప్టెనా లేక జట్టులో అత్యుత్తమ ఆటగాడా? అనేది కుంబ్లే ప్రణాళికలో భాగం కాదన్నాడు. 'ప్రతీ ఒక్క ఆటగాడిపైనా కుంబ్లే దృష్టి పెట్టాడు. అది అతని ప్రణాళికలో భాగం.విరాట్ కోహ్లినా?లేక నేనా అనేది ముఖ్యం కాదు. ఈ తరహా విధానమే చాలా ముఖ్యం'అని ధవన్ అన్నాడు.
గతంలో రవిశాస్త్రితో కలిసి పనిచేయడం కూడా తనకు ఒక మంచి అనుభవమని ధవన్ ఈ సందర్భంగా తెలిపాడు. జట్టు సభ్యులమంతా అతనితో పంచుకున్న డ్రెస్సింగ్ రూమ్ వాతావారణం నిజంగా అద్భుతమన్నాడు. అటు రవిశాస్త్రితో పాటు, ఇటు కుంబ్లే కూడా దిగ్గజ ఆటగాళ్లేనని... వీరితో కలిసి పని చేయడంతో అనేక విషయాలను తెలుసుకోవడానికి ఆస్కారం దొరుకుతుందని ధవన్ అన్నాడు.