
మయూఖా జానీకి స్వర్ణం
దోహా: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల లాంగ్‌జంప్‌లో మయూఖా జానీ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. మయూఖా 6.35 మీటర్ల దూరం దూకి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తద్వారా ఆసియా ఇండోర్ చాంపియన్‌షిప్‌లో లాంగ్‌జంప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. మహిళల 60 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్, 1500 మీటర్ల రేసులో సుగంధ కుమారి కాంస్యాలు నెగ్గారు.