ప్రేమ్ కుమార్‌కు రజతం
దోహా: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రజత పతకం లభించింది. పురుషుల లాంగ్‌జంప్ ఈవెంట్‌లో కుమారవెల్ ప్రేమ్ కుమార్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రేమ్ కుమార్ 7.92 మీటర్ల దూరం దూకి తన ఖాతాలో రజత పతకాన్ని వేసుకున్నాడు. జాంగ్ యావోగువాంగ్ (చైనా-7.99 మీటర్లు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల షాట్‌పుట్‌లో ఓంప్రకాశ్ కర్హానా ఇనుప గుండును 18.77 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచాడు. ఓవరాల్‌గా ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు, మూడు కాంస్యాలు లభించాయి.