ఆసీస్ను ఏం బాదావు గురూ: సెహ్వాగ్ | australia gets trolled in the rhyming fashion by Virender Sehwag | Sakshi
Sakshi News home page

ఆసీస్ను ఏం బాదావు గురూ: సెహ్వాగ్

Published Sat, Oct 1 2016 3:36 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

ఆసీస్ను ఏం బాదావు గురూ: సెహ్వాగ్

ఆసీస్ను ఏం బాదావు గురూ: సెహ్వాగ్

సెంచూరియన్: ఏం సందర్భం వచ్చినా సమయానుకూలంగా స్పందించే టీమిండియా మాజీ డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్.. ఈసారి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును టార్గెట్ చేశాడు. ఇందుకు కారణం దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్ ఘోర పరాజయం చెందడమే.

ఒకవైపు దక్షిణాఫ్రికా ఓపెనర్ డీ కాక్ చేతిలో తీవ్రంగా భంగ పడిన ఆస్ట్రేలియా పూర్తిగా డైలామాలో పడితే... ఆ జట్టును ఏం బాదావంటూ మన 'ట్విట్టర్ కింగ్' సెహ్వాగ్  ట్వీట్ చేశాడు.  'డీ కాక్.. వాట్ ఎ నాక్.. ధమాకా దార్ నాక్' అంటూ కొనియాడాడు. కేవలం ఒక్కడికి దాసోహమైన ఆసీస్కు ఇద్ది పెద్ద షాక్ అంటూ ట్వీట్ చేశాడు. 

 

సెంచూరియన్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్ విసిరిన 295 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా సునాయాసంగా ఛేదించింది. ఆస్ట్రేలియాపై డీకాక్ (178:16 ఫోర్లు, 11 సిక్సర్లు) విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా 36.2 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. (ఇక్కడ క్లిక్ చేయండి:16ఫోర్లు.. 11 సిక్సర్లు)

 

     De Kock what a Knock.@QuinnyDeKock69 ka dhamaakedaar Knock, Australia Shock.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement