అలీ @ 123, 120, 101 | Azhar Ali hits three consecutive ODI hundreds | Sakshi
Sakshi News home page

అలీ @ 123, 120, 101

Published Wed, Oct 5 2016 7:43 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

అలీ @ 123, 120, 101

అలీ @ 123, 120, 101

అబుదాబి: పాకిస్థాన్ కెప్టెన్ అజర్ అలీ అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో మూడు సెంచరీలు చేసిన తొలి పాకిస్థాన్ కెప్టెన్గా అలీ ఘనత సాధించాడు. వెస్టిండీస్తో జరుగుతున్న వన్డే సిరీస్లో అలీ వరుసగా మూడు మ్యాచ్ల్లో (123, 120, 101) శతకాలు బాదాడు. బుధవారం జరుగుతున్న మూడో వన్డేలో అలీ (101) సెంచరీ చేసి ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

కాగా పాకిస్థాన్ తరఫున ఈ ఫీట్ నమోదు చేసిన మూడో బ్యాట్స్మన్గా నిలిచాడు. గతంలో జహీర్ అబ్బాస్, సయీద్ అన్వర్ వరుసగా మూడు వన్డేల్లో మూడు శతకాలు బాదారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement