చిట్టగాంగ్ : బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాల మధ్య శనివారం ముగిసిన తొలి టెస్టు డ్రా అయ్యింది. భారీ వర్షం కారణంగా ఐదో రోజు ఆట కూడా రద్దుకావడంతో మ్యాచ్ డ్రాకు దారితీసింది. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో మైదానం చిత్తడిగా మారింది. దీంతో ఒక్క బంతి కూడా సాధ్యపడలేదు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు 30 నుంచి జరుగుతుంది.