ఢాకా: బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భారీ వర్షం కారణంగా రెండో రోజు ఆట రద్దయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. శుక్రవారం ఉదయం నుం చి మధ్యాహ్నం వరకు కుండపోతగా వర్షం కురవడంతో ఆట రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.