ఇదేం సిరీస్: ఆమ్లా
దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ డ్రా
ఢాకా: ఎడతెరపి లేని వర్షం కారణంగా బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టులో చివరి రోజు ఆట కూడా సాధ్యపడలేదు. దీంతో మ్యాచ్‌లో నాలుగు రోజులు పూర్తిగా వృథా అయ్యాయి. ఫలితంగా మ్యాచ్ డ్రా అయింది. రెండు జట్ల మధ్య చిట్టగాంగ్‌లో జరిగిన తొలి టెస్టులోనూ చివరి రెండు రోజులు వర్షం కారణంగా రద్దు కావడంతో ఆ మ్యాచ్ కూడా డ్రా అయింది. దీంతో సిరీస్ 0-0తో డ్రాగా ముగిసింది. దీనిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆమ్లా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘పది రోజుల క్రికెట్ సిరీస్‌లో కేవలం నాలుగు రోజులు మాత్రమే మైదానంలో ఉన్నాం. ఆరు రోజులు పెవిలియన్‌లో కూర్చోవడం చిరాకు కలిగించింది. ఇలాంటి సిరీస్ నేనెప్పుడూ ఆడలేదు’ అని ఆమ్లా అన్నాడు.