ఢాకా: బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు వీడటం లేదు. భారీ వర్షం కారణంగా నాలుగో రోజు ఆట కూడా రద్దయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఆ తర్వాత శుక్ర, శనివారాల్లో ఆట సాధ్యంకాలేదు. ఆదివారం కూడా ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో మైదానం చిత్తడిగా మారింది. కేవలం మరో రోజు ఆట మిగిలి ఉన్న ఈ టెస్టు మ్యాచ్ డ్రా కావడం లాంఛనమే.