ఢాకా: వచ్చే నెలలో బంగ్లాదేశ్లో పర్యటించనున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు భారీ భద్రత కల్పించనున్నారు. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చింది. ఈ ఏడాది జూలైలో ఢాకాలో జరిగిన ఉగ్రదాడుల్లో దాదాపు 18 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో పర్యటించడానికి తొలుత ఇంగ్లండ్ వెనుకడుగు వేసింది. అక్కడ పరిస్థితిని పూర్తిగా అధ్యయన చేసిన తరువాత ఇటీవల బంగ్లా పర్యటనకు ఈసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ క్రమంలోనే ఇంగ్లండ్ జట్టు సభ్యుల భద్రతకు సంబంధించి భరోసాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నజాముద్దీన్ చౌదురి తాజాగా స్పష్టం చేశారు. కేవలం క్రికెట్ జట్లకే పటిష్ట భద్రత పరిమితం కాకుండా, మ్యాచ్ లను వీక్షించే ప్రేక్షకుల భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. ఈ మేరకు తమదేశ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి స్పష్టమైన హామీని తీసుకున్నామన్నారు.
ఇంగ్లండ్ జట్టుకు పటిష్ట భద్రత పై హామీ
Published Thu, Sep 29 2016 3:57 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
Advertisement