
రాజస్తాన్ టార్గెట్ 181
ఐపీఎల్-8 ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా రాజస్తాన్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.
పూణే: ఐపీఎల్-8 ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా రాజస్తాన్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. మూడో వికెట్కి డివిలియర్స్(38 బంతుల్లో 66; 4 ఫోర్; 4 సిక్స్) , మన్‌దీప్ల(34 బంతుల్లో 54; 7 ఫోర్; 2 సిక్స్) జోడి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వీరిజోడి 113 పరుగల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచిన బెంగళూరు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లుగా వచ్చిన కోహ్లి, గేల్ల జోడీ 41 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం ఇచ్చింది. రెండో ఓవర్లోనే రనౌట్ అయ్యే అవకాశం నుంచి తృటిలో తప్పించుకున్న గేల్(26 బంతుల్లో27; 4 ఫోర్; 1 సిక్స్) ఎక్కువసేపు క్రీజ్లో నిలువలేకపోయాడు. కులకర్ణి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కులకర్ణి వేసిన తరువాతి ఓవర్లోనే కోహ్లి(12) బౌలర్కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వెంట వెంటనే వీరిద్దరూ అవుటవ్వడంతో స్కోరు వేగం తగ్గింది.
ఒక దశలో బెంగళూరు స్కోరు 10 ఓవర్లకి 60/2 పరుగులు మాత్రమే ఉంది. మొదట్లో నిదానంగా ఆడిన డివిలియర్స్, మన్‌దీప్ల జోడి ఆ తర్వాత స్కోరు వేగం పెంచారు. 159 పరుగుల వద్ద రెండో రన్ కి ప్రయత్నించి డివిలియర్స్(66) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కార్తీక్(8) సిక్సర్ కి ప్రయత్నించి ఔటయ్యాడు. మన్‌దీప్ల(54), సర్ఫరాజ్(1) పరుగులతో నాటౌట్గా నిలిచారు.
రాజస్తాన్ బౌలింగ్ లో కులకర్ణికి 2 వికెట్లు, మోరీస్ కు ఒక వికెట్ లభించింది.