
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎలక్టోరల్ అధికారిగా ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ ఎన్. గోపాలస్వామి నియమితులయ్యారు. అక్టోబర్ 22న వార్షిక సర్యసభ్య సమావేశంలో జరుగనున్న బీసీసీఐ కార్యవర్గం ఎన్నికలకు గోపాలస్వామి ఎలక్టోరల్ అధికారిగా వ్యవహరిస్తారు. క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఇటీవలే బీసీసీఐ ఎన్నికల నిర్వహణపై స్పష్టతనిచ్చింది. ఈ నేపథ్యంలో హెడ్ క్వార్టర్స్‌లో శుక్రవారం సమావేశమైన సీఓఏ ఎన్నికల విధివిధానాలపై చర్చించింది. ఎన్నికల అధికారిగా గోపాలస్వామి ని ఎంపిక చేసింది. రాష్ట్ర సంఘాలకు సెప్టెంబర్ 24న ఎన్నికలు జరుగనున్నట్లు ప్రకటించింది. 2017 జనవరిలో సుప్రీం కోర్టు నియమించిన క్రికెట్ పరిపాలక కమిటీ (సీఓఏ) క్రికెట్‌లో లోధా కమిటీ సిఫారసుల అమలును పర్యవేక్షిస్తోంది.