న్యూఢిల్లీ: నాలుగు దేశాల అండర్-19 వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మహారాష్ట్రకు చెందిన విజయ్ జోల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో ఆకట్టుకున్న హైదరాబాద్ బౌలర్ సీవీ మిలింద్, ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్‌లకు జట్టులో స్థానం లభించింది.
ఈ నెల 23 నుంచి అక్టోబర్ 5 వరకు విశాఖపట్నంలో ఈ టోర్నీ జరుగుతుంది. ఇందులో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు పాల్గొంటున్నాయి.
మిలింద్, భుయ్‌లకు చోటు
Published Wed, Sep 18 2013 1:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
Advertisement
Advertisement