'కుంబ్లే కోచ్ పదవిపై గ్యారంటీ లేదు'
న్యూఢిల్లీ:భారత క్రికెట్ కోచ్ అనిల్ కుంబ్లే పదవిపై గ్యారంటీ ఏమీ లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) స్పష్టం చేసింది. ఒకవేళ భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటికీ కుంబ్లే కోచ్ పదవిపై పూర్తి హామీ ఇవ్వలేమని పేర్కొంది. కొత్త కాంట్రాక్ట్ కు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవడానికి చాంపియన్స్ ట్రోఫీ ప్రామాణికం కాదని తాజాగా బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
'భారత క్రికెట్ కోచ్ గా కుంబ్లేను తిరిగి ఎంపిక చేయడంపై గ్యారంటీ ఇవ్వలేం. కొత్త కాంట్రాక్ట్ పై నిర్ణయం చాంపియన్స్ ట్రోఫీ తరువాతే తీసుకుంటాం. చాంపియన్స్ ట్రోఫీలో భారత ప్రదర్శన ఆధారంగా కోచ్ ఎంపిక జరగకపో్వచ్చు. జట్టు ప్రదర్శన అనేది కోచ్ ఒక్కడిపైనే ఆధారపడదు. ప్రస్తుతానికి కొత్త కోచ్ గురించి ఆలోచించడం లేదు. భారత్ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ప్రదర్శనపైనే పూర్తి స్థాయి దృష్టి సారించాం'అని సదరు అధికారి తెలిపారు.