ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు రికార్డు వేతనాలు | Cricket Australia gives landmark pay rise to women players | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు రికార్డు వేతనాలు

Published Wed, Apr 6 2016 4:12 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు రికార్డు వేతనాలు

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు రికార్డు వేతనాలు

కాన్బెర్రా: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు దేశంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న క్రీడాకారిణులుగా రికార్డుల కెక్కనున్నారు. ఆ దేశ క్రికెట్ సంఘం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మహిళా క్రికెటర్లకు భారీగా జీత భత్యాలను పెంచింది. ప్రస్తుతం సంవత్సరానికి 1.8 మిలియన్ ఆస్ట్ర్రేలియన్ డాలర్లుగా ఉన్న వీరి ఆదాయం త్వరలో 3.2 మిలియన్లకు చేరనుంది. దీంతో టాప్ లిస్ట్లో ఉన్న మహిళా క్రికెటర్లు దాదాపు ఆరు రెట్లు, తర్వాతి స్థానాల్లో ఉన్న క్రికెటర్లకు రెండు రెట్లు అధిక జీతాలను అందుకోనున్నారు. మరే ఇతర క్రీడల్లోనూ ఇంత పెద్ద మొత్తంలో క్రీడాకారిణులకు జీతభత్యాలు లేవు.

దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా క్రికెటర్లకు 37,000 నుంచి 50,000 ఆస్ట్రేలియన్ డాలర్లకు జీతాలను పెంచారు. మహిళ బిగ్ బాష్ లీగ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి 12,000 ఆస్టేలియన్ డాలర్లకు పెంచారు. ఆస్ట్రేలియా తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ ప్లేయర్లకు 62,000 ఆస్ట్రేలియన్ డాలర్లతో పాటు రవాణా ఖర్చులు, టూర్ ఛార్జీలను అదనంగా సీఏ భరించనుంది. సాధారణ మహిళా క్రికెటర్లకు సైతం 14,000 నుంచి 30,000 ఆస్ట్రేలియన్ డాలర్లకు సంవత్సర ఆదాయాన్ని పెంచింది క్రికెట్ ఆస్ట్ర్రేలియా.

క్రికెట్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచి ప్రతిభను ప్రోత్సహించేందుకే జీతభత్యాలు భారీగా పెంచుతున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్ సదర్లాండ్ వివరించారు. రాబోయే కాలంలో సీఏ మరింతగా మహిళలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. మహిళలు క్రికెట్ను కెరీర్గా ఎంచుకునే విధంగా సీఏ పనిచేస్తుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement