
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల విరామం తర్వాత భారత్‌కు మళ్లీ స్వర్ణ పతకం లభించింది. ఎస్తోనియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల 86 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో దీపక్ పూనియా విశ్వవిజేతగా అవతరించాడు. ఫైనల్లో అలిక్ షెబ్‌జుకోవ్ (రష్యా)పై దీపక్ విజయం సాధించాడు. చివరిసారి 2001లో భారత్ తరఫున ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రమేశ్ కుమార్ (69 కేజీలు), పల్విందర్ సింగ్ చీమా (130 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment