డెన్మార్క్ ఓపెన్ నుంచి సైనా నిష్క్రమణ | Defending champion Saina bows out of Denmark Open | Sakshi
Sakshi News home page

డెన్మార్క్ ఓపెన్ నుంచి సైనా నిష్క్రమణ

Published Fri, Oct 18 2013 9:06 PM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM

డెన్మార్క్ ఓపెన్ నుంచి సైనా నిష్క్రమణ

డెన్మార్క్ ఓపెన్ నుంచి సైనా నిష్క్రమణ


ఓడెన్స్: డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి  సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ నుంచి నిష్రమించింది. కొరియన్ క్రీడాకారిణి సంగ్ జి హ్యూన్ చేతిలో 13-21,21- 18, 21-19 తేడాతో సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది.  తొలి సెట్ ను సునాయసంగా గెలిచిన సైనా ఆ తరువాత పూర్తి స్థాయిలో రాణించలేకపోవడంతో పరాజయం తప్పలేదు. ఈ మ్యాచ్ లో విజయంతో సంగ్ జి హ్యూన్ ఇండోనేషియా ఓపెన్ ఓటమి కి ప్రతీకారం తీర్చుకుంది.
 

ఈ మ్యాచ్ కు ముందు వరకూ సైనా నే 4-0 తేడాలో ముందంజలో ఉంది. దీంతో అందరూ సైనానే ఫేవరెట్ గా ఊహించారు. కాగా , ఈ మ్యాచ్ లో మాత్రం సైనా పేలవమైన ఆటను ప్రదర్శించడంతో టో్ర్నీ నుంచి భారంగా నిష్రమించింది. అంతకు ముందు గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సైనా 21-12, 21-7తో కిర్‌స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)పై విజయం సాధించి క్వార్టర్స్ కు చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement