మొహాలి: టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు మరో సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో వన్డేలో రోహిత్-ధావన్‌ల జంట సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. దాంతో వన్డే ఫార్మాట్‌లో 15వ సారి సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించినట్లయ్యింది. అదే సమయంలో వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల నమోదు చేసిన ఓపెనింగ్ జోడిల్లో గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ సరసన రోహిత్-ధావన్‌ల జంట నిలిచింది. వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల నమోదు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ(21 సెంచరీ భాగస్వామ్యాలు) తొలిస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో గిల్‌క్రిస్ట్-మాథ్యూ హేడెన్(16 సెంచరీ భాగస్వామ్యాలు) జోడి ఉంది.
ఆసీస్‌తో నాల్గో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు రోహిత్-ధావన్‌లు శుభారంభం అందించారు. ఒకవైపు ధావన్ ధాటిగా బ్యాటింగ్ కొనసాగిస్తే, రోహిత్ మాత్రం కుదురుగా ఆడాడు. ఈ క్రమంలోనే ధావన్ హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. ధావన్ 44 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ పెద్దగా ఆకట్టుకోని ధావన్.. ఈ మ్యాచ్‌లో మాత్రం తనదైన షాట్లతో విరుచుకుపడ్డాడు. భారత్ 19 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 111 పరుగులు చేసింది.
ఇక్కడ చదవండి: రోహిత్-ధావన్‌ల జోడి మరో ఘనత
Comments
Please login to add a commentAdd a comment