చెన్నై సూపర్ కింగ్స్ను రద్దు చేయండి: సుప్రీంకోర్టు | disqualify chennai super kings, orders supreme court | Sakshi
Sakshi News home page

చెన్నై సూపర్ కింగ్స్ను రద్దు చేయండి: సుప్రీంకోర్టు

Published Thu, Nov 27 2014 2:08 PM | Last Updated on Thu, Sep 27 2018 8:42 PM

చెన్నై సూపర్ కింగ్స్ను రద్దు చేయండి: సుప్రీంకోర్టు - Sakshi

చెన్నై సూపర్ కింగ్స్ను రద్దు చేయండి: సుప్రీంకోర్టు

ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని రద్దుచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దోషులుగా తేలినవారిపై చర్యలకు ఎక్స్టెర్నల్ కమిషన్ వేయాలని తెలిపింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. బీసీసీఐ ఎన్నికలను షెడ్యూలు ప్రకారమే జరుపుకోవచ్చు గానీ, ముద్గల్ నివేదికలో పేర్లున్నవాళ్లు మాత్రం బీసీసీఐ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

ఇక బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ను సుప్రీం ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో వాటాదారుల వివరాలు ఇవ్వాలని తెలిపింది. ఇండియా సిమెంట్స్ యాజమాన్యంలోని సీఎస్కే ఎవరి నియంత్రణలో ఉందని ప్రశ్నించింది. సీఎస్కే కెప్టెన్ ధోనీ ఇండియా సిమెంట్స్లో పనిచేయడంపై కూడా సుప్రీంకోర్టు ఆరా తీసింది. అన్ని రకాల వివాదాలకు తెరదించాలని బీసీసీఐని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

(చదవండి - చెన్నై సూపర్ కింగ్స్ను రద్దుచేసే అవకాశం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement