
పెంగ్‌షుయె (చైనా): వరల్డ్ మాస్టర్స్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి హారిక 3.5 పాయింట్లతో 12వ స్థానంలో, హంపి 2.5 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచారు. ఐదో రౌండ్‌లో స్టెఫానోవా (బల్గేరియా)తో 64 ఎత్తుల్లో ఓడిన హంపి... ఎలిజబెత్ (జర్మనీ)తో జరిగిన ఆరో గేమ్‌ను 33 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. ఏడో రౌండ్ గేమ్‌లో అనస్తాసియా (రష్యా) చేతిలో 23 ఎత్తుల్లో, ఎనిమిదో గేమ్‌లో ఇరినా క్రుష్ (అమెరికా) చేతిలో 40 ఎత్తుల్లో పరాజయం పాలైంది. మరోవైపు ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన ఐదో గేమ్‌ను 90 ఎత్తుల్లో, టింగ్‌జి (చైనా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను 67 ఎత్తుల్లో, జనిడ్జె (జార్జియా)తో ఏడో గేమ్‌ను 23 ఎత్తుల్లో డ్రా చేసుకున్న హారిక... జోంగ్‌యి (చైనా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో 76 ఎత్తుల్లో ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment