ఎనిమిదోసారి ‘మియామి’ టైటిల్ సొంతం
ఫ్లోరిడా : మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ తన కెరీర్‌లో 66వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీలో ఈ అమెరికా స్టార్ ఎనిమిదోసారి విజేతగా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సెరెనా 6-2, 6-0తో కార్లా స్యురెజ్ నవారో (స్పెయిన్)పై గెలిచింది.
విజేతగా నిలిచిన సెరెనాకు 9,00,400 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 కోట్ల 77 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ సాధించిన క్రమంలో సెరెనా ఒకే టోర్నీని ఎనిమిదిసార్లు నెగ్గిన నాలుగో క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో ఈ ఘనతను మార్టినా నవ్రతిలోవా (చికాగో ఓపెన్-12 సార్లు), స్టెఫీ గ్రాఫ్ (బెర్లిన్ ఓపెన్-9 సార్లు), క్రిస్ ఎవర్ట్ (హిల్టర్ హెడ్ ఓపెన్-8 సార్లు) సాధించారు.
ఎదురులేని సెరెనా
Published Mon, Apr 6 2015 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM
Advertisement
Advertisement