96 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌.. | England Won a Test Match By 1 wicket After 96 years | Sakshi
Sakshi News home page

96 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌..

Published Mon, Aug 26 2019 10:52 AM | Last Updated on Mon, Aug 26 2019 10:55 AM

England Won a Test Match By 1 wicket After 96 years - Sakshi

లీడ్స్‌:  యాషెస్‌ సిరీస్‌లో  భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.  ఆసీస్‌ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఇంకా వికెట్‌ మిగిలి ఉండగా ఛేదించింది. బెన్‌ స్టోక్స్‌ (219 బంతుల్లో 135 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) క్రీజ్‌లో పాతుకుపోయి ఇంగ్లండ్‌కు గెలుపును అందించాడు. 286 వద్ద 9వ వికెట్‌ పడిన దశలో మరో 73 పరుగులు చేయాల్సిన తరుణంలో స్టోక్స్‌ సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. 11వ నంబరు బ్యాట్స్‌మన్‌ జాక్‌ లీచ్‌ (17 బంతుల్లో 1 నాటౌట్‌)ను కాపాడుకుంటూ స్టోక్స్‌ చెలరేగి జట్టును గెలుపు బాట పట్టించాడు.

కాగా, తమటెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌ వికెట్‌ తేడాతో గెలవడం ఇది నాల్గోసారి మాత్రమే. 1902లో ఆసీస్‌తో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి వికెట్‌ తేడాతో గెలిచిన ఆసీస్‌..  1907-08 సీజన్‌లో మెల్‌బోర్న్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్‌ తేడాతో విజయం సాధించింది. ఆపై 1922-23 సీజన్‌లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో చివరిసారి వికెట్‌ తేడాతో గెలిచిన ఇంగ్లండ్‌.. ఆపై ఇంతకాలానికి వికెట్‌ తేడాతో గెలుపును ఖాతాలో వేసుకుంది. 96 ఏళ్ల తర్వాత వికెట్‌ తేడాతో టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ సొంతం చేసుకుంది.

కాగా,  ఆసీస్‌తో జరిగిన తాజా యాషెస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది. ఇది ఇంగ్లండ్‌కు అత్యధిక ఛేజింగ్‌ రికార్డుగా నిలిచింది. 1928-29 సీజన్‌లో ఆసీస్‌తో 332 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్‌ ఛేదించిన అత్యధిక పరుగుల రికార్డు ఇప్పటివరకూ ఉండగా, దాన్ని ఇప్పుడు ఇంగ్లండ్‌ బ్రేక్‌ చేసింది. ఇక ఛేజింగ్‌ పరంగా చూస్తే 10 వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన రెండో జోడిగా బెన్‌ స్టోక్స్‌-జాక్‌ లీచ్‌లు నిలిచారు. 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జోడి కుశాల్‌ పెరీరా-విశ్వ ఫెర్నాండోలు 10వ వికెట్‌కు అజేయంగా 78 పరుగులు సాధించింది. అది ఇప్పటికీ తొలి స్థానంలో ఉండగా, స్టోక్స్‌-లీచ్‌ల రికార్డు రెండో స్థానాన్ని ఆక్రమించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement