నా గురించి పూర్తిగా తెలియదు: సచిన్ | every body not knows everything about me, says Sachin | Sakshi
Sakshi News home page

నా గురించి పూర్తిగా తెలియదు: సచిన్

Published Wed, May 10 2017 11:23 AM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM

నా గురించి పూర్తిగా తెలియదు: సచిన్

నా గురించి పూర్తిగా తెలియదు: సచిన్

ముంబై‌: తన గురించి ఎన్నో విషయాలు తెలుసునని అభిమానులు భావిస్తుంటారని, అయితే వారికి ఎన్నో తెలియని అంశాలు చాలా ఉన్నాయని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. సచిన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్' ప్రచార కార్యక్రమంలో సచిన్ మాట్లాడారు. 'నా అభిమానులకు ఎన్నో తెలియని విషయాలున్నాయి. అందుకే జీవితకథ ద్వారా వారికి దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ఈ మూవీ నన్ను కొత్తగా ఆవిష్కరిస్తుంది. నా జీవితంలోని ఎన్నో మధురస్మృతులను తెరపై చూసుకోనుండటం నన్ను మరింత ఉత్తేజితం చేస్తుంద'ని సచిన్ చెప్పారు.

ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చిన ఓ పాటను సచిన్ ఆవిష్కరించారు. సచిన్ సచిన్ అంటూ మొదలయ్యే ఈ పాటకు సఖ్విందర్ గాత్రం అందించాడు. నిర్మాత రవి భాగ్‌చందక మాట్లాడుతూ.. సచిన్ ఇంట్లో వెయ్యి గంటల పాటు ఉన్న అరుదైన వీడియోల నుంచి  25 నిమిషాలపాటు అరుదైన సీన్లను తెరపై చూపిస్తామన్నారు. కేవలం తన ఇంట్లో మాత్రమే యాక్సెస్ అయ్యే కొన్ని వీడియోలను మూవీ యూనిట్ కు సచిన్ చూపించారు. వాంఖెడే స్డేడియంలో సచిన్ ఆటను మూవీలో చూడవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement