
బర్మింగ్‌హామ్: అదో ప్రతిష్టాత్మక ఈవెంట్... గోల్డ్ మెడల్ ఫేవరెట్ సహా స్టార్ అథ్లెట్లందరూ బరిలోకి దిగారు. అయితే హీట్స్‌లోనే వీరంతా అనర్హతకు గురయ్యారు. విశేషం ఏమిటంటే ఐదుగురు అథ్లెట్లు ఈ హీట్స్‌లో పాల్గొనగా వేర్వేరు కారణాలతో వీరందరూ డిస్‌క్వాలిఫై కావడం! వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ పురుషుల 400 మీటర్ల విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత ఏడాది ఈ విభాగంలో అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసిన బ్రలోన్ టాప్లిన్ (గ్రెనడా) కూడా డిస్‌క్వాలిఫయర్స్ జాబితాలో ఉన్నాడు.
లైన్ తప్పి పరుగెత్తడంతో బ్రలోన్‌తో పాటు స్టీవెన్ గేల్ (జమైకా), ఆస్ట్రిస్ కార్పిన్‌స్కిస్ (లాత్వియా), అలోంజో రసెస్ (బహమాస్)లపై అనర్హత వేటు పడింది. అంతకు ముందే అబ్దుల్లా హరూన్ (ఖతార్) ఫాల్స్ స్టార్ట్‌తో డిస్‌క్వాలిఫై అయ్యాడు. వీరిలో ఇద్దరు అప్పీల్ చేసినా లాభం లేకపోయింది. ఒక మేజర్ చాంపియన్‌షిప్‌లో హీట్స్‌లో పాల్గొన్న అందరూ అనర్హతకు గురి కావడం చరిత్రలో ఇదే మొదటిసారి అని స్వయంగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ప్రకటించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment