డోపింగ్ కారణంగా రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై కొనసాగుతున్న నిషేధాన్ని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) పొడిగించింది.
లండన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరం
పారిస్: డోపింగ్ కారణంగా రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై కొనసాగుతున్న నిషేధాన్ని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) పొడిగించింది. ఈమేరకు ఐఏఏఎఫ్ చేసిన ప్రతిపాదనను పాలక మండలి కౌన్సిల్ ఆమోదించింది. దీంతో ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు రష్యా అథ్లెట్లు దూరం కానున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రష్యా అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడుతున్నారని తేలడంతో 2015 నవంబర్ నుంచి అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనకుండా ఆ దేశాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే గత డిసెంబర్‌లో జరిగిన పాలక మండలి సమావేశం అనంతరం మరికొంత అనుమానాస్పద సంఘటనలు జరిగాయని అందుకే వారి సభ్యత్వ పునరుద్ధరణపై వెనక్కి తగ్గామని ఐఏఏఎఫ్ కౌన్సిల్ పేర్కొంది.