అంకిత ,కర్మన్‌కౌర్
న్యూఢిల్లీ: ఫెడ్ కప్ ఆసియా ఓసియానియా టెన్నిస్ టోర్నమెంట్ గ్రూప్–1లో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. ఇప్పటికే వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన భారత్ శనివారం చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్‌లో 2–0తో గెలుపొందింది. తొలి సింగిల్స్‌లో కర్మన్‌కౌర్ థండి గెలుపొందడం... రెండో మ్యాచ్‌లో అంకిత జోరు కొనసాగించడంతో భారత్ విజయంతో టోర్నీని ముగించింది.
తొలి మ్యాచ్‌లో కర్మన్‌కౌర్ 7–6 (7/4), 6–3తో లీ పై చీపై విజయం సాధించడం ద్వారా 1–0 ఆధిక్యం అందించింది. ఆ తర్వాత సుదీర్ఘంగా సాగిన రెండో మ్యాచ్‌లో అంకిత 6–4, 5–7, 6–1తో ప్రపంచ 377వ ర్యాంకర్ చియె యూ సూపై గెలుపొందింది. 2 గంటల 54 నిమిషాల పాటు సాగిన ఈ మారథాన్ మ్యాచ్‌లో అంకిత అద్భుత ప్రదర్శన కనబర్చింది. టోర్నీలో అంకిత నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment