ఆంటిగ్వా: వెస్టిండీస్-ఏ జట్టుతో జరిగిన ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌లో భారత్ -ఏ జట్టు తిరుగులేదని నిరూపించింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత యువ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఐదో వన్డేలో విండీస్ నిర్దేశించిన 237 పరుగుల టార్గెట్‌ను భారత-ఏ జట్టు 33 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్(99), శుబ్‌మన్ గిల్(69), శ్రేయస్ అయ్యర్(61)లు భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
కాగా, ఈ సిరీస్‌లో ఆద్యంతం ఆకట్టుకున్న శుబ్‌మన్ గిల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శుబ్‌మన్ గిల్ 218 పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా రుతురాజ్ గ్వైక్వాడ్(207 పరుగులు), అయ్యర్(187 పరుగులు), మనీష్ పాండే(162 పరుగులు)లు నిలిచారు. ఇక బౌలింగ్ విభాగంలో ఖలీల్ అహ్మద్ 9 వికెట్లతో ‘టాప్’లో నిలవగా, నవదీప్ షైనీ 8వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment