
సాక్షి, హైదరాబాద్: భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య నూతన కార్యవర్గం కొలువుదీరింది. సమాఖ్య అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎన్నికవగా... ఉపాధ్యక్షులుగా దినేశ్ పటేల్, కె. జగదీశ్వర్ యాదవ్ నియమితులయ్యారు. రిటర్నింగ్ అధికారి నీరజ్ గుప్తా ఆధ్వర్యంలో భారత అమెచ్యూర్ కబడ్డీ సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్‌లో 14 మంది సభ్యులతో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
భారత కబడ్డీ సమాఖ్య కార్యదర్శిగా తేజస్వీ సింగ్, కోశాధికారి నిరంజన్ సింగ్ వ్యవహరించనున్నారు. ఎ. సఫియుల్లా, కుల్దీప్ కుమార్ గుప్తా, కుమార్ విజయ్ సింగ్, రుక్మిణి కామత్ సంయుక్త కార్యదర్శులుగా ఎన్నికవగా... అశోక్ చౌదరి, భువనేశ్వర్, హనుమంత్ గౌడ, కుల్దీప్ సింగ్ దలాల్, రాజ్‌కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా తమ బాధ్యతలు నిర్వహిస్తారు.