నటాషా.. అంత గ్లో ఎలా వచ్చింది? | Hardik Pandya Asks Natasa Stankovic About Her Glow | Sakshi
Sakshi News home page

నటాషా.. అంత గ్లో ఎలా వచ్చింది?

Published Sat, Jun 27 2020 4:16 PM | Last Updated on Sat, Jun 27 2020 4:20 PM

Hardik Pandya Asks Natasa Stankovic About Her Glow - Sakshi

ముంబై: భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. తన కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుందనే విషయాన్ని ఇటీవల హార్దిక్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. కాగా, తాజాగా నటాషాతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ క్రమంలోనే ప్రేయసి నటాషాను పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రధానంగా నటాషా ముఖంలో  వచ్చే మెరుపును ఉద్దేశించి హార్దిక్‌ కామెంట్‌ చేశాడు. ఏయ్‌ నటాషా.. ‘ నీ ముఖంలో గ్లోకు కారణం ఏమిటి. అది ఎక్కడ నుంచి వస్తుంది’ అని ప్రశ్నించాడు. దానికి నటాషా ఒక క్యూట్‌ సమాధానం ఇచ్చారు.  ఇక్కడ క్రెడిట్‌ అంతా హార్దిక్‌ పాండ్యాకే ఇచ్చారు నటాషా. ‘ నీ ప్రేమ.. వాత్సల్యమే నా ముఖం వచ్చిన గ్లోకు కారణం’ అని తెలివిగా రిప్లై ఇచ్చారు. (‘రైజర్స్‌’తోనే నేర్చుకున్నా... )

గత నెలలో తాను తండ్రిని కాబోతున్నాననే విషయాన్ని హార్దిక్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, దీవెనలు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది’ అని హార్దిక్‌ పేర్కొన్నాడు. కాకపోతే వీరు పెళ్లి చేసుకున్నారో లేదా అనేది మాత్రం సస్పెన్స్‌. గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు.  ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టి20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌.. శస్త్ర చికిత్స తర్వాత న్యూజిలాండ్‌ ‘ఎ’ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా, చివరి నిమిషంలో హార్దిక్‌ ఇంకా కోలుకోలేకపోవడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా అది కరోనా వైరస్‌ కారణంగా జరగలేదు. కాగా, హార్దిక్‌ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే క్రమంలో రెచ్చిపోయి ఆడాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్‌ టీ20 కప్‌లో రిలయన్స్‌-1 తరఫున ఆడిన హార్దిక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.  బీపీసీఎల్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ సాధించిన హార్దిక్‌..  ఓవరాల్‌గా 55 బంతుల్లో 20 సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 158 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. దాంతో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత రికార్డు నమోదు చేసిన భారత క్రికెటర్‌గా హార్దిక్‌ రికార్డు సృష్టించాడు. అంతకుముందు  కాగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు.  ఇక్కడ కూడా 39 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఇందులో 10 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉండటం విశేషం. ఇక బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో జరిగిన తన రీఎంట్రీ ఆరంభపు మ్యాచ్‌లో  25 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్స్‌లతో 38 పరుగులు సాధించి సత్తా చాటాడు. (‘నల్లవారిని’ నిరోధించేందుకే...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement