
టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆరో ‘డ్రా’ నమోదు చేసింది. నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీ పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్‌లో హారిక 32 ఎత్తుల్లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ జియాంగ్ జెఫ్రీని నిలువరించింది. ఇదే వేదికపై జరుగుతున్న మాస్టర్స్ టోర్నీలో పీటర్ స్విద్లెర్ (రష్యా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 27 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment