
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్, ఫ్రాన్స్ జట్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. సోమవారం జరిగిన క్రాస్ ఓవర్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ 2–0తో న్యూజిలాండ్‌పై, ఫ్రాన్స్ 1–0తో చైనాపై గెలుపొందాయి. ఇంగ్లండ్ తరఫున విల్ కాల్నన్ (25వ ని.), లూక్ టేలర్ (44వ ని.) ఒక్కో గోల్ చేశారు.
మరో క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో చైనాపై గెలిచేందుకు ఫ్రాన్స్ చెమటోడ్చింది. ఈ పోరులో నమోదైన ఏకైక గోల్‌ను టిమోతీ క్లెమెంట్ (36వ ని.) మూడో క్వార్టర్‌లో సాధించిపెట్టాడు. ఈ 1–0 ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకున్న ఫ్రాన్స్ మ్యాచ్‌లో గట్టెక్కింది. మంగళవారం జరిగే క్రాస్ ఓవర్ మ్యాచ్‌ల్లో బెల్జియంతో పాకిస్తాన్; కెనడాతో నెదర్లాండ్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment