'అలా ఆడడం మామూలు విషయం కాదు'
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్ వైట్ హీరోగా మారిపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో విండీస్ ను విజేతగా నిలిపిన బ్రాత్ వైట్ ఐపీఎల్ లో ప్రేక్షకులను స్టేడియంకు రప్పిస్తాడని ఢిల్లీ డేర్ డెవిల్స్ సీఈవో హేమంత్ దువా అన్నారు. తీవ్రమైన ఒత్తిడిలో అతడు ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమని ప్రశంసించారు. క్లిష్టపరిస్థితుల్లో అసాధారణంగా ఆడడం మామూలు విషయం కాదన్నారు. ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే ప్రేక్షకులు మైదానానికి వస్తారని తెలిపారు.
ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున బ్రాత్ వైట్ ఆడనున్నాడు. ఈ ఏడాది నిర్వహించిన వేలంలో రూ.4.2 కోట్లకు అతడిని ఢిల్లీ టీమ్ దక్కించుకుంది. టీ20 వరల్డ్ కప్ లో బ్రాత్ వైట్ ఆటతీరు పట్ల హేమంత్ దువా సంతృప్తి వ్యక్తం చేశారు.