హైదరాబాద్ 290/1
సాక్షి, హైదరాబాద్: హనుమ విహారి (235 బంతుల్లో 163 బ్యాటింగ్; 16 ఫోర్లు), తన్మయ్ అగర్వాల్ (300 బంతుల్లో 114 బ్యాటింగ్; 13 ఫోర్లు) శతకాలతో కదం తొక్కడంతో గోవాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు శుభారంభం లభించింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ మొదటి రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో వికెట్ నష్టానికి 290 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన గోవా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. బందేకర్ వేసిన మూడో ఓవర్లోనే అక్షత్ రెడ్డి (4) అవుటయ్యాడు. అనంతరం తన్మయ్, విహారి రెండో వికెట్‌కు అభేద్యంగా 276 పరుగులు జోడిం చారు. కెరీర్‌లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న తన్మయ్ అరంగేట్రంలోనే సెంచరీ సాధిం చిన ఆరో హైదరాబాద్ బ్యాట్స్‌మన్‌గా నిలి చాడు. నెల రోజుల క్రితమే లిస్ట్ ‘ఎ’క్రికెట్ లో నూ తొలి మ్యాచ్‌లోనే తన్మయ్ సెంచరీ చేశాడు.
విహారి, తన్మయ్ సెంచరీలు
Published Mon, Dec 15 2014 12:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement