సాక్షి, హైదరాబాద్: ఇండియన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐఎంబీఎల్)లో హైదరాబాద్ నవాబ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. తమిళనాడులోని తిర్పూర్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఢిల్లీ డెవిల్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 16 నుంచి 19 వరకు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి.
దాదాపు 60 మంది జాతీయ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఈ టోర్నీలో తలపడగా... మనోజ్‌కుమార్, నీలిమ చౌదరీ, కమలాకర్, రాజు సునీల్, కిషోర్ కుమార్, ఉదయ్ భాస్కర్, మూర్తిలతో కూడిన హైదరాబాద్ నవాబ్స్ జట్టు రెండో స్థానంతో సరిపెట్టుకుంది.