ముంబై : వైజాగ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ గెలిచినా బ్యాట్స్‌మెన్ పరీక్షించడానికే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ బిషప్ అభిప్రాయపడ్డారు. స్టార్ స్పోర్ట్స్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఇయాన్.. 2019 ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా కోహ్లి ఆ నిర్ణయం తీసుకున్నాడని స్పష్టం చేశారు. (చదవండి: ఓవర్లో ఆరు సార్లయినా డైవ్ చేస్తా!)
‘ కోహ్లి టాస్ గెలిచినా బ్యాటింగ్ ఎంచుకోవడనికి మరో కారణం ఏం లేదు. అతను తన జట్టును పరీక్షించాలనుకున్నాడు. అదే చేశాడు. హెట్‌మైర్-హోప్‌ల భాగస్వామ్యం భారత్ 2-0 ఆధిక్యం సాధించకుండా అడ్డుకుంది. తొలి వన్డేలో కోహ్లి-రోహిత్‌లను చూసి స్పూర్తి పొందిన ఈ జోడి రెండో వన్డేలో మెరిసింది. విండీస్ ఆటగాళ్లు కోహ్లి ఓ గొప్ప ఆటగాడని కొనియాడుతూనే.. అతనిలా గోప్ప ఆటగాళ్లు కావాలనుకుంటాన్నారు’అని ఈ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఇక తొలి వన్డేలో భారత్ గెలవగా.. రెండో వన్డే టై అయిన విషయం తెలిసిందే. మూడో వన్డే పుణె వేదికగా శనివారం జరగనుంది.(చదవండి: హెట్‌మైర్ కోసం ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీల వేట?)
Comments
Please login to add a commentAdd a comment