కరాచీ: ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ నాకౌట్‌కు చేరుకుండా నిష్క్రమించడంతో ఆ మెగాటోర్నీలో ఆ దేశ కెప్టెన్‌గా వ్యవహరించిన సర్ఫారాజ్ అహ్మద్‌పై తీవ్ర విమర్శల వర్షం కురిసింది. ఇటీవల సర్ఫరాజ్‌ను టెస్టు, టీ20 ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తొలగిస్తూ పీసీబీ నిర్ణయం కూడా తీసుకుంది. మరొకవైపు ఆసీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో కూడా సర్ఫరాజ్‌కు అవకాశం దక్కలేదు. దీన్ని ఉదహరిస్తూనే సర్పరాజ్ అహ్మద్‌ను దేశవాళీ క్రికెట్ ఆడుకోమంటూ ఆ దేశ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సలహా ఇచ్చారు.వరల్డ్‌కప్‌లో పాక్ పేలవ ప్రదర్శన తర్వాత తమ క్రికెట్ జట్టు ఎలా ఉండాలో తానే నిర్దేస్తానంటూ ఇమ్రాన్ ఆ సమయంలోనే పేర్కొన్నాడు. ఇప్పుడు అదే పనిలో ఇమ్రాన్ నిమగ్నమయ్యారు. ముందుగా సర్ఫరాజ్ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలో ఇమ్రాన్ సూచించాడు.
జాతీయ జట్టులో కొనసాగుతున్నప్పటికీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోతున్న సర్పరాజ్‌ను ముందుగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడమంటూ ఇమ్రాన్ హితబోధ చేశారు.‘ ఇక సర్ఫరాజ్ దేశవాళీ మ్యాచ్‌లపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. టీ20 ప్రదర్శన ఆధారంగా ఒక ఆటగాడి ఫామ్‌ను అంచనా వేయలేం. టెస్టు క్రికెట్ కానీ, వన్డే క్రికెట్‌లో కానీ ఒక ఆటగాడి ప్రదర్శన బయటకు వస్తుంది. ముందుగా సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్‌పై ఫోకస్ చేయాలి. జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ మ్యాచ్‌ల్లో ఉత్తమ ప్రదర్శన అవసరం. నువ్వు ఘనంగా పాకిస్తాన్ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తావనే అనుకుంటున్నా’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.ఇక పాకిస్తాన్ ప్రధాన కోచ్‌గా చీఫ్ సెలక్టర్‌గా ఎంపికైన మిస్బావుల్ హక్‌పై ఇమ్రాన్ ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్ క్రికెట్ కోచ్‌గా మిస్బావుల్ అన్ని విధాలుగా అర్హుడని పేర్కొన్నారు. అతనొక అత్యుత్తమ ఆటగాడు కావడంతో ప్రస్తుత జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శనకు కూడా మెరుగవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment