క్రికెట్‌లో ఇక మహిళా అంపైర్లు: ఐసీసీ | In cricket Women's umpires : ICC | Sakshi
Sakshi News home page

క్రికెట్‌లో ఇక మహిళా అంపైర్లు: ఐసీసీ

Published Sun, Mar 9 2014 1:33 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

In cricket Women's umpires : ICC

దుబాయ్: క్రికెట్‌లో మహిళల భాగస్వామ్యం పెంచే దిశగా ఐసీసీ మరో అడుగు ముందుకేసింది. అంపైర్లుగానూ మహిళలకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు న్యూజిలాండ్‌కు చెందిన కేతీ క్రాస్‌కు ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ అంపైర్ల ప్యానల్ ఇచ్చిన సభ్యత్వానికి అధికారిక గుర్తింపునిచ్చింది.

శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్సన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రిచర్డ్సన్ మాట్లాడుతూ.. కేతీ మహిళలకేగాక, పురుషులకూ స్ఫూర్తిదాయకం కాగలదని, ఆమె నియామకంతో క్రికెట్‌లో మహిళా అధికారుల సంఖ్య పెరగగలదని భావిస్తున్నట్లు చెప్పారు. కేతీ ప్రస్తుతం మలేసియాలో జరుగుతున్న పురుషుల వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్-5 క్వాలిఫికేషన్ టోర్నీలో అంపైర్‌గా వ్యవహరిస్తుండడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement