భారత్ బ్యాటింగ్ అదుర్స్
భారత్ బ్యాటింగ్ అదుర్స్
Published Tue, May 30 2017 6:54 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM
► బంగ్లాదేశ్‌కు భారీ లక్ష్యం
► భారత్ స్కోరు 324/7
లండన్: చాంపియన్స్ ట్రోఫికి సన్నహకంగా జరుగుతున్న భారత్, బంగ్లాదేశ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ బ్యాట్స్ మెన్ సమిష్టిగా రాణించడంతో బంగ్లాదేశ్‌కు భారత్ 324 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. దినేశ్ కార్తీక్ శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యాలు అర్ధ సెంచరీలు సాధించడంతో భారత్ బారీ స్కోరు చేయగలిగింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ(1) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే(11) మరోసారి నిరాశపర్చాడు. మరో ఓపెనర్ ధావన్, దినేష్ కార్తీక్ తో తన ఫామ్‌ను కొనసాగించాడు. వీరిద్దరు మూడో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 63 పరుగలుతో అర్ధ శతకం సాధించిన ధావన్ (7 ఫోర్లతో 60) పరుగులు చేసి సన్జాముల్ ఇస్లాం బౌలింగ్ లో వెనుదిరిగాడు.
ఇక 51 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన కార్తీక్ (8 ఫోర్లతో 94) పరుగులు చేసి రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. కేదార్ జాదవ్ (38), జడేజా(32) లు ఫర్వాలేదనిపించారు. ఇక యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వేగంగా ఆడుతూ 39 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. అనంతరం రెచ్చిపోయిన పాండ్యా (6 ఫోర్లు, 4 సిక్సర్లతో) 80 పరుగులు చేసి నౌటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్లో అశ్విన్(5) అవుటవ్వగా పాండ్యా చివరి బంతిని సిక్స్‌గా మలిచి ఇన్నింగ్స్‌ను ముగించాడు. భువనేశ్వర్ కుమార్(1) నాటౌట్ గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో రూబెల్ హుస్సేన్(3), సన్జాముల్ ఇస్లాం(2). ముస్తాఫిజుర్ రహ్మాన్ (1) వికెట్లు దక్కాయి. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, కీపర్ ధోని, యువరాజ్‌లు బ్యాటింగ్‌కు రాకుండా యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు.
Advertisement
Advertisement