
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి పాకిస్తాన్ రెజ్లర్లు భారత్‌కు రానున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ రెజ్లర్లు అయిన ముహమ్మద్ బిలాల్, అబ్దుల్ రెహ్మాన్, తయబ్ రాజా, జమాన్ అన్వర్‌లకు భారత ప్రభుత్వం శనివారం వీసాలను జారీ చేసినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాక్‌లో భారత్, భారత్‌లో పాక్ పర్యటించలేదు. గత ఏడాది డేవిస్ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌లో భారత్ పర్యటించాల్సి ఉన్నా... భద్రతా కారణాలతో ఆ పోరు తటస్థ వేదికపై జరిగింది. కోవిడ్–19 వైరస్ కారణంగా చైనా రెజ్లర్లకు ఇంకా వీసాలను జారీ చేయలేదు. వీరి విషయంపై నేడు స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment