ఐర్లాండ్‌తో భారత్‌ రెండు టి20లు  | India has two T20s with Ireland | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్‌తో భారత్‌ రెండు టి20లు 

Published Thu, Jan 11 2018 12:51 AM | Last Updated on Thu, Jan 11 2018 12:51 AM

India has two T20s with Ireland - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌లో భారత క్రికెట్‌ జట్టు ఐర్లాండ్‌తో రెండు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇంగ్లండ్‌తో జూలై–సెప్టెంబరు మధ్య జరగనున్న పూర్తి స్థాయి సిరీస్‌కు ముందు టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఈ మ్యాచ్‌లు జూన్‌ 27, 29 తేదీల్లో డబ్లిన్‌లో జరుగుతాయని బీసీసీఐ బుధవారం ప్రకటించింది.

భారత్‌ చివరిసారి 2007లో బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌ జట్టుతో వన్డే ఆడింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 9 వికెట్లతో విజయం సాధించింది. తర్వాత 2009 టి20 ప్రపంచకప్‌ సందర్భంగా నాటింగ్‌హామ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement