వారెవ్వా రోహిత్‌.. సూపర్ సెంచరీ | India vs South Africa 1st Test Rohit Sharma Hits Century | Sakshi
Sakshi News home page

వారెవ్వా రోహిత్‌.. సూపర్ సెంచరీ

Published Wed, Oct 2 2019 2:20 PM | Last Updated on Wed, Oct 2 2019 6:03 PM

India vs South Africa 1st Test Rohit Sharma Hits Century - Sakshi

విశాఖపట్నం : టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెటర్‌గా ఉన్న అపవాదును తొలిగించుకునే ప్రయత్నంలో వేసిన ముందుడుగు విజయవంతమయ్యాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా పరీక్షకకు దిగిన రోహిత్‌ సఫలమయ్యాడు. టెస్టులకు కావాల్సిన ఓపిక, టెక్నిక్‌తో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా వీలుచిక్కినప్పుడల్లా తనదైన మార్క్‌ బౌండరీలతో అలరించాడు. దీంతో చాలా కాలాం తర్వాత టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్‌ లాంటి ఆటను రోహిత్‌ శర్మ ద్వారా చూసే అవకాశం క్రికెట్‌ అభిమానులకు లభించింది. బుధవారం విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో రోహిత్‌ శర్మ శతక్కొట్టాడు. టెస్టుల్లో ఓపెనర్‌ వచ్చిన తొలి మ్యాచ్‌లోనే రోహిత్‌ సెంచరీ కావడం విశేషం. 

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ప్రారంభంలో రోహిత్‌తో పాటు మయాంక్‌ సంయమనంతో ఆడారు. క్రీజులో కుదురుకున్నాక చెత్త బంతులను బౌండరీలు తరలించారు. దీంతో లంచ్‌ విరామం వరకే రోహిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తిచేశాడు. లంచ్‌ అనంతరం రెచ్చిపోయిన ఓపెనర్లు మరింత దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో మయాంక్‌ అర్దసెంచరీ సాధించాడు. మరోవైపు రోహిత్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో  కేవలం 154 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో సెంచరీ పూర్తి చేశాడు.  మరోవైపు మయాంక్‌ కూడా సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాడు. తొలి రోజు టీ విరామ సమయానికి టీమిండియా 59.1 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్‌ శర్మ(115; 174 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు), మయాంక్‌(84 బ్యాటింగ్‌; 183 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నారు.   

(విశాఖపట్నంలో క్రికెట్ సందడి దృశ్యాల కోసం... క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement