
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆకట్టుకున్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో విశాఖలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఎన్నో అంచనాల మధ్య ఓపెనర్‌గా మైదానంలో అడుగుపెట్టిన రోహిత్.. ఆరంభంలో ఆచితూచి ఆడాడు. అనంతరం తనదైన శైలిలో రెచ్చిపోయాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ రోహిత్‌కు చక్కటి సహకారాన్ని అందించాడు.
ఈ క్రమంలో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చిన తొలి మ్యాచ్‌లోనే అర్దసెంచరీ పూర్తి చేయడం విశేషం. ఓపెనర్లు రాణించడంతో లంచ్ విరామం వరకు టీమిండియా 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ(52 బ్యాటింగ్; 84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మయాంక్ అగర్వాల్(39 బ్యాటింగ్; 96 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్సర్) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment