ముంబై: శ్రీలంకతో ఇక్కడ వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా ఫీల్డింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ మ్యాచ్ ద్వారా తమిళనాడు బ్యాటింగ్ ఆల్ రౌండర్ వాషింగ‍్టన్ సుందర్ టీ 20ల్లో అరంగేట్రం చేశాడు. మరొకవైపు హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్‌ను సైతం తుది జట్టులో తీసుకున్నారు. ఈ క్రమంలోనే స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, పేసర్ బూమ్రాలను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేశారు. కాగా, కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉందని భావించిన దీపక్ హుడా, బాసిల్ థంపిలకు నిరాశే ఎదురైంది.
ఇప‍్పటికే సిరీస్‌ను భారత్ సొంతం చేసుకున్న తరుణంలో చివరి మ్యాచ్‌లో కూడా గెలిచి క్లీన్‌స్వీప్‌తో ముగించాలని భావిస్తోంది. మరొకవైపు శ్రీలంక మూడో మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి స్వదేశానికి పరువుతో పయనం కావాలనుకుంటోంది. ఈ ఏడాది భారత్ ఆడే చివరి మ్యాచ్ ఇది. విజయవంతంగా నడిపించిన 2017ను దిగ్విజయం గా ముగించే సువర్ణావకాశం టీమిండియా చేతిలో ఉంది. తిసారా పెరీరా సేన మాత్రం తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. టెస్టుల్లో పోరాడింది. వన్డేల్లో (తొలి మ్యాచ్) షాకిచ్చింది. కానీ మెరుపుల సిరీస్‌లో మాత్రం భారత్ ధాటికి నిలువలేకపోతోంది.
టెస్టు, వన్డే సిరీస్‌ల తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థి పేస్‌కు విలవిల్లాడిన భారత బ్యాట్స్‌మెన్ టి20 సిరీస్‌లో మాత్రం చెలరేగి ఆడుతున్నారు. తొలి రెండు మ్యాచ్‌ల్ని ఏకపక్షంగా ముగించడంలో బ్యాటింగ్ దళమే ప్రధాన పాత్ర పోషించింది. కెప్టెన్ రోహిత్, శ్రేయస్ అయ్యర్, లోకేశ్ రాహుల్ ఎదురులేని ఫామ్‌లో ఉన్నారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాహుల్ అర్ధసెంచరీలతో కదంతొక్కాడు. సారథి రోహిత్ విశ్వరూపానికి ఇండోర్ వేదిక మొదటి సాక్షి అయ్యింది. వెటరన్ స్టార్ ధోని కూడా ఫామ్‌లో ఉన్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ బరిలోకి దిగిన ఈ మాజీ సారథి షరామామూలుగా ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. ఈ క్రమంలో టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోని, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఉనాద్కత్, సిరాజ్
శ్రీలంక: తిషారీ పెరీరా(కెప్టెన్), ఉపుల్ తరంగా, డిక్విల్లా, దనుష గుణతిలకా, సమరవిక్రమా, గుణరత్నే, షనక, దనంజయ, చమీరా, ప్రదీప్, కుశాల్ పెరీరా
Comments
Please login to add a commentAdd a comment