ఇండోర్: శ్రీలంకతో మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి వన్డేలో టీమిండియా భారీ విజయంలో పాలుపంచుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మూడు రికార్డులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఒకే మ్యాచ్‌లో 35కు పైగా పరుగులు చేయడంతో పాటు నలుగుర్ని అవుట్ చేయడంలో భాగస్వామ్యమైన ధోని ఆ ఘనత సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డు పుస్తకాల్లోకికెక్కాడు. ఓవరాల్‌గా చూస్తే దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డీకాక్, పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సరసన ధోని నిలిచాడు. మరొకవైపు ఓవరాల్ టీ 20 ఫార్మాట్‌లో 201 అవుట్‌లలో ధోని భాగస్వామ్యమయ్యాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్‌గా ధోని గుర్తింపు సాధించాడు. మరొకవైపు నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన ఘనతను కూడా ధోని సాధించాడు. టీ 20 ఫార్మాట్‌లో నాల్గో స్థానంలో ధోని 134.01గా బ్యాటింగ్ స్టైక్ రేట్‌తో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఇది లంకేయులతో జరిగిన తొలి టీ 20 తరువాత ధోని సాధించిన ఘనతలు.
ఇప్పుడు శ‍్రీలంకతో రెండో టీ 20లో మరో రికార్డును సాధించేందుకు ధోని చేరువగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ధోని మరో మూడు క్యాచ్‌లు పడితే అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌లో 50 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం 47 అంతర్జాతీయ టీ 20 క్యాచ్‌లతో ఉన్న ధోని ఉన్నాడు. మరి ఈ మ్యాచ్‌లో ధోని 'హాఫ్ సెంచరీ' రికార్డు సాధిస్తాడా?లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment