ముంబై: శ్రీలంకతో జరిగిన మూడు టీ 20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరిదైన మూడో టీ20లో రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. శ్రీలంక విసిరిన 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 39 పరుగులకే ఓపెనర్లు కేఎల్ రాహుల్(4), రోహిత్ శర్మ(27) వికెట్లను కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే శ్రేయస్ అయ్యర్(30), మనీష్ పాండే(32)లు ఫర్వాలేదనిపించడంతో పాటు దినేశ్ కార్తీక్(16 నాటౌట్), ఎంఎస్ ధోని(18 నాటౌట్) చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టుకు విజయాన్ని అందించారు.
అంతకుముందు శ్రీలంక ఏడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. గుణరత్నే(36) చలవతో శ్రీలంక మోస్తరు స్కోరును టీమిండియా ముందుంచింది. టాస్ గెలిచిన రోహిత్ సేన.. లంకను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో లంక ఇన్నింగ్స్‌ను డిక్వెల్లా, తరంగాలు ఆరంభించారు. కాగా, కాగా, ఉనాద్కత్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి డిక్విల్లా భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. ఆపై మూడో ఓవర్ ఆఖరి బంతికి పెరీరాను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు. ఇక్కడ ధోని స్టంపింగ్ చేయడంతో పెరీరా పెవిలియన్ బాట పట్టాడు. ఇక నాల్గో ఓవర్‌లో తరంగా అవుటయ్యాడు. ఉనాద్కత్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి తరంగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక సమరవిక్రమ(21) నాల్గో వికెట్‌గా అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
కాగా, 12 ఓవర్‌లో గుణతిలకా(5)ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేయగా, ఆ తదుపరి ఓవర్‌లో కెప్టెన్ తిషారా పెరీరా(11)ను సిరాజ్ పెవిలియ్‌కు పంపాడు. అయితే ఏడో వికెట్‌కు షనక(29 నాటౌట్)-గుణరత్నేలు 26 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో పాటు చివరి ఓవర్‌లో దనంజయ(11 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో లంక జట్టు ఫర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో ఉనాద్కత్, హార్దిక్ పాండ్యాలు చెరో రెండు వికెట్లు సాధించగా, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లకు తలో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment